MANA TOLIVELUGU
Newspaper Banner
Date of Publish : 14 October 2026, 1:11 pm Posted by : MANA TOLIVELUGU

కొత్తమాలె లక్ష్మి రెడ్డి రెండో వర్ధంతి.. సందేరాళ్ల పోటీలకు ఘనంగా ఏర్పాట్లు

విజేతలకు రూ.15,016తో ప్రారంభమయ్యే నగదు బహుమతులు

మన తొలివెలుగు | జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి గడ్డం సుధాకర్ | అక్టోబర్ 14, 2026 :

మాజీ వైస్ ఎంపీపీ, ధరూర్ మండలం పొంగుటి ఆలయ కమిటీ చైర్మన్ కె. వెంకట్రామి రెడ్డి తండ్రి, సీడ్ ఆర్గనైజర్ కీ.శే. కొత్తమాలె లక్ష్మి రెడ్డి రెండో వర్ధంతి సందర్భంగా అక్టోబర్ 15 గురువారం సందేరాళ్ల పోటీలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ధరూర్ మండలంలోని నాగర్ దొడ్డి గ్రామంలో మధ్యాహ్నం 12 గంటలకు ఈ పోటీలు ప్రారంభం కానున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన సందేరాళ్ల క్రీడాకారులు పాల్గొననుండగా, ఆసక్తి ఉన్నవారందరికీ ఆహ్వానం పలుకుతున్నట్లు సీడ్ ఆర్గనైజర్ కే. శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

విజేతలకు నగదు బహుమతులు

పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు వరుసగా మొదటి బహుమతి రూ.15,016, రెండో బహుమతి రూ.10,016, మూడో బహుమతి రూ.8,016, నాలుగో బహుమతి రూ.5,016, ఐదో బహుమతి రూ.3,016, ఆరో బహుమతి రూ.2,016, ఏడో బహుమతి రూ.1,016, ఎనిమిదో బహుమతి రూ.516 అందజేయనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి క్రీడాకారులు, అభిమానులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కే. వెంకట్రామి రెడ్డి (9848898770), కే. శ్రీనివాస్ రెడ్డి (9182036483) కోరారు.