MANA TOLIVELUGU
Newspaper Banner
Date of Publish : 24 July 2026, 7:28 pm Posted by : MANA TOLIVELUGU

కోయిలకొండ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ డీ. జానకి

మన తొలివెలుగు, ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో ప్రతినిధి ఎన్. హరీష్ :

ప్రజలకు నాణ్యమైన, పారదర్శకమైన సేవలు అందించడమే పోలీసుల ప్రధాన లక్ష్యమని జిల్లా ఎస్పీ డీ. జానకి స్పష్టం చేశారు. శుక్రవారం కోయిలకొండ పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన ఆమె, స్టేషన్ రికార్డులు, పెండింగ్ కేసులు, శాంతి భద్రతల పరిస్థితిపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలని, మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రాధాన్యమిస్తూ పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని ఆదేశించారు. అలాగే నేరాల నియంత్రణ, కమ్యూనిటీ పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కోయిలకొండ ఎస్‌ఐ, సిబ్బంది పాల్గొన్నారు.