మాజీ వైస్ ఎంపీపీ, ఆలయ కమిటీ చైర్మన్ వెంకట్రామిరెడ్డి
గెలుపొందిన విజేతలకు వెంకట్రామిరెడ్డి, గ్రామ సర్పంచ్ మల్లారెడ్డి చేతుల మీదుగా బహుమతుల ప్రధాన
మన తొలివెలుగు, జోగులాంబ గద్వాల జిల్లా బ్యూరో ప్రతినిధి గడ్డం సుధాకర్
క్రీడలు మానసిక ఉల్లాసానికి, శరీర దారుడ్యానికి ఎంతో దోహదం చేస్తాయని జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం మాజీ వైస్ ఎంపీపీ, ఆలయ కమిటీ చైర్మన్ వెంకట్రామిరెడ్డి, నాగర్ దొడ్డి గ్రామ సర్పంచ్ కొత్త మాలే మల్లారెడ్డి అన్నారు. ధరూర్ మండలం నాగర్ దొడ్డి గ్రామ స్థాయి యూత్ క్రికెట్ టోర్నమెంట్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. గ్రామంలోని యువకులు క్రీడా పోటీలలో నైపుణ్యం పొంది జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయిలో అనేక విజయాలు సాధించాలని సూచించారు. క్రికెట్ టోర్నమెంట్ లో నాగర్ దొడ్డి యువకులు ప్రతిభ కనబరిచారని కొనియాడారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తాను ఎప్పుడు సాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉంటానని తెలిపారు.

ఈ క్రికెట్ టోర్నమెంట్ లో గెలుపొందిన విజేతలకు నగదు పురస్కారాలను అందజేశారు. మొదటి బహుమతి చాకలి సురేష్ టీమ్ కు సభ్యులకు ₹ 5016/- లను నాగర్ దొడ్డి సర్పంచ్ కొత్తమాలే మల్లారెడ్డి చేతుల మీదుగా అందజేశారు. రెండవ బహుమతిని చాకలి నరేందర్ టీమ్ కు ₹ 3016/-లను కొత్తమాలే శ్రీనివాస్ రెడ్డి అందజేశారు. మూడో బహుమతి బోయ లాలు టీమ్ కు ₹ 1016/- లను వార్డు సభ్యులు చాకలి శివన్న, చిన్నపాటి సత్తన్న అందజేశారు. ఈ కార్యక్రమంలో జంగం నాగరాజు, గాడుదల మునీంద్ర, వెంకటేష్, కొండాపురం ఈరన్న, గోవిందు, సత్య, రాము, చాకలి నర్సింహులు, హనుమంతు తదితరులు పాల్గొన్నారు.