MANA TOLIVELUGU
Newspaper Banner
Date of Publish : 29 April 2026, 1:25 pm Posted by : MANA TOLIVELUGU

క్షేత్రస్థాయిలో బాల్యవివాహాలను అంగన్వాడీలు అరికట్టాలి

మన తొలివెలుగు,నాగర్ కర్నూల్ ప్రతినిధి విజయకాంత్

ప్రజా పాలన – ప్రగతి నివేదిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం లో మండల స్థాయి సమావేశం మంగళవారం పాత కలెక్టరేట్ లోని ఐసిడిఎస్ భవనంలో జరిగింది. ముఖ్య అతిథులు రెవిన్యూ డివిజనల్ ఆఫీసర్ సురేష్ మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో బాల్యవివాహాలను అడ్డుకోవటంలో అంగన్వాడి కార్యకర్తలు సిబ్బంది చురుగ్గా పనిచేయాలని అన్నారు. మండల రెవెన్యూ అధికారి సబితారాణి,ఉపతాసిల్దార్ కిరణ్ కుమార్,మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి హాజరై పలు సూచనలు చేశారు.నాగర్ కర్నూలు ఇన్చార్జి సిడిపిఓ శోభారాణి మాట్లాడుతూ అంగన్వాడిలో ప్రజా పాలన ప్రగతి నివేదికలో చేసిన కార్యక్రమాల గురించి,కిశోర బాలికలకు బాల్య వివాహాలు జరగకుండా,అంగన్వాడి టీచర్ల పరిధిలో వారికి సమావేశాలు పెట్టాలని,పిల్లల బరువులు ఎత్తులు గురించి వారి యొక్క ఆరోగ్య స్థాయి గురించి మాట్లాడడం జరిగింది.ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ కృష్ణవేణి బ్లాక్ కోఆర్డినేటర్ కృష్ణవేణి సఖి,హెల్ప్ లైన్,భరోసా మరియు అంగన్వాడీ టీచర్లు తల్లులు కిశోర బాలికలు పాల్గొన్నారు.