MANA TOLIVELUGU
Newspaper Banner
Date of Publish : 24 May 2026, 7:36 pm Posted by : MANA TOLIVELUGU

గుర్తుకొస్తున్నాయి..

నారాయణపేట శ్రీ సరస్వతీ శిశు మందిర్ పూర్వ విద్యార్థులు, ఆచార్యుల ఆత్మీయ సమ్మేళనం

తెలంగాణ బ్యూరో రిపోర్టర్ కనుగుల సాయి కిషోర్

నారాయణపేట జిల్లా శ్రీ సరస్వతీ శిశు మందిర్ 2001- 2002 బ్యాచ్ పూర్వ విద్యార్థుల, ఆచార్యుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు. 25 ఏళ్ల తర్వాత తమ చిన్ననాటి స్నేహితులను, గురువులను కలుసుకోవడానికి పూర్వ విద్యార్థులు ఉత్సాహం చూపారు.

ఈ సమ్మేళనంలో 2001-2002 విద్యా సంవత్సరంలో పదవ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు, అప్పటి ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు పాల్గొననున్నారు. పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ, గురువుల ఆశీర్వాదం తీసుకునేందుకు ఈ వేదికను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. సమ్మేళనం సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు, పూర్వ విద్యార్థుల అనుభవాల పంచుకోవడం, గురువుల సన్మానం వంటి కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.