సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు గుంపల్లి అశోక్
మన తొలివెలుగు, నాగర్ కర్నూల్ బ్యూరో ప్రతినిధి విజయ్ కాంత్
ఆర్.ఎం.పీ డాక్టర్లు కాంటీన్ జెన్సి మందులు ఇచ్చి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు గుంపల్లి అశోక్ అన్నారు. శుక్రవారం బిజినపల్లి మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మండలంలో ఉన్న అన్ని గ్రామాలలో ఆర్.ఎం.పీ లు ప్రధమ చికిత్స కేంద్రాలను ఒక్కొక్క ఊర్లో రెండు మూడు ఏర్పాటు చేసుకొని ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారని ఆయన అన్నారు. హైడోస్ మందులు ఇవ్వడంతో ఇతర రోగాలకు కారణమవుతున్నారని, ప్రాణాపాయస్థితికి వచ్చే సరికి ఇతర ప్రాంతాలకు రిఫర్ చేయడం.. తీరా ప్రాణాలు కోల్పోతే సంబంధం లేకుండా మాట్లాడుతున్నారని ఇటువంటి ఘటనలు మండలంలో గతంలో జరిగాయని తెలిపారు. జిల్లా వైద్యాధికారులు మొన్న జరిపిన శోదాలలో కేవలం మండల కేంద్రంలో మాత్రమే తనిఖీ చేశారని గ్రామాలలో విచ్చల విడిగా ప్రజలను దోచుకుంటున్నారని అన్నారు. గ్రామాలలో కూడా వైద్యాధికారులు, తనిఖీలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సీనియర్ నాయకులు బోనాసి శుభాకర్, మల్లేష్, చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు.