గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం తక్షణమే నిధులు విడుదల చేయాలి
ప్రత్యేక నిధులు విడుదల చేసి గ్రామాల్లో నెలకొన్న రోడ్ల, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలి మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య ముదిరాజ్ : గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేసి మౌలిక సదుపాయాలైన రోడ్లు, డ్రైనేజీలు, అభివృద్ధి పనులను చేపట్టాలని, పారిశుద్ధ్యం, వీధి దీపాలు వంటి సమస్యలను పరిష్కరించాలనీ దావూద్‌గూడ గ్రామ ఉపసర్పంచ్ ఆర్. తేజనాయక్ ప్రభుత్వాన్ని కోరారు. గ్రామాల్లో ప్రధాన రహదారులు, అంతర్గత సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలు దెబ్బతినడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో రోడ్లపై గుంతలు ఏర్పడి...