గ్రామ పరిశుభ్రత ఆరోగ్య పరిరక్షణకు సహకరించాలి

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య ముదిరాజ్ : రాబోయే వర్షాకాలంలో గ్రామ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి, గ్రామ పరిశుభ్రత ఆరోగ్య పరిరక్షణకు సహకరించాలని, వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సర్పంచ్ హనుమతు నాయక్, ఉపసర్పంచ్ ఆర్. తేజ నాయక్ అన్నారు. దావూద్ గూడ గ్రామ పంచాయతీ కార్యాలయంలో రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రామ ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై అవగాహన కల్పించారు. వారి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు....