ఘనంగా ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం
మన తొలివెలుగు, మోత్కూర్ ప్రతినిధి పబ్బు ప్రవీణ్ : యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీ కేంద్ర పరిధిలోని రాజన్నగూడెంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఇందిరమ్మ ఇల్లు’ పథకం కింద నిర్మించుకున్న నూతన గృహప్రవేశ మహోత్సవం బుధవారం అత్యంత వైభవంగా జరిగింది. లబ్ధిదారులు పుచ్చకాయల మహేందర్ రెడ్డి- స్వాతి దంపతులు తమ నూతన గృహంలోకి శాస్త్రోక్తంగా ప్రవేశించారు. ఈ వేడుకకు స్థానిక తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ ముఖ్య అతిథిగా హాజరై, రిబ్బన్ కట్ చేసి గృహప్రవేశం చేయించారు. లబ్ధిదారులను ఆయన ఘనంగా...