MANA TOLIVELUGU
Newspaper Banner
Date of Publish : 24 May 2026, 8:44 pm Posted by : MANA TOLIVELUGU

ఘనంగా గాజనబోయిన హర్షిత, గంగ నూతన పట్టు వస్త్రాలంకరణ మహోత్సవం 

మన తొలివెలుగు, తెలంగాణ బ్యూరో ప్రతినిధి 

నల్లగొండ జిల్లా, చండూరు మండలం, దోనిపాముల గ్రామానికి చెందిన గాజనబోయిన శ్రీనివాసులు, సునీత దంపతుల ముద్దుల కూతుర్లు, కీర్తిశేషులు గాజనబోయిన ఎల్లయ్య మనమరాళ్లు హర్షిత, గంగ ల నూతన పట్టు వస్త్రాలంకరణ మహోత్సవ కార్యక్రమం బంగారుగడ్డ ఎస్.ఆర్.బీ ఫంక్షన్ హాల్ లో ఘనంగా కనుల పండుగగా నిర్వహించారు.

నూతన పట్టు వస్త్రాల అలంకరణ మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న కుటుంబ సభ్యులు నాయనమ్మ మారమ్మ, బాబాయ్ ఏడుకొండలు, చిన్నమ్మ అనురాధ, అమ్మమ్మ , తాతయ్యలు నీలమ్మ , కట్ట యాదయ్య, మేనమామలు జక్కార్తి నరసింహా, కానబోయిన శేఖర్, కట్ట వెంకటేష్ మహేందర్, మేనత్తలు పద్మ శైలజా ( మంగమ్మ), సువర్ణ రేణుక, దోనిపాముల గ్రామ సర్పంచ్ దాసరి స్వామి, మాజీ సర్పంచ్ తిప్పర్తి దేవేందర్, మండల నరసింహ, చిలువేరు రమేష్, లింగయ్య తదితరులు, శ్రేయోభిలాషులు, స్నేహితులు, సన్నిహితులు, దోనిపాముల గ్రామ వాసులు పాల్గొని చిన్నారులను ఆశీర్వదించారు. అక్కా చెల్లెళ్లు హర్షిత, గంగ భవిష్యత్తులో ఉన్నత చదువులు చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకున్నారు. జీవితాంతం ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో గడపాలని వచ్చిన ప్రతి ఒక్కరూ దీవించారు.