మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య ముదిరాజ్ :
నమ్మిన వారికి అండగా నిలిచే నైజం. ఇచ్చిన మాటకు కట్టుబడే వ్యక్తిత్వం కలిగిన జల్ పల్లి సర్కిల్ ఐ.ఎన్.టీ.యూ.సీ ప్రెసిడెంట్ చింతకింది నవీన్ గౌడ్ జన్మదిన వేడుకలను కుటుంబ సభ్యుల, స్నేహితుల, శ్రేయోభిలాషుల, అభిమానుల మధ్య ఘనంగా జరుపుకున్నారు. రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీ.యూ.ఎఫ్.ఐ.డీ.సీ ) చైర్మన్ చల్లా నరసింహారెడ్డి, మహేశ్వరం నియోజకవర్గం ఐ.ఎన్.టీ.యూ.సీ జనరల్ సెక్రెటరీ రెడ్డిగళ్ళ అజయ్, స్నేహితులు ప్రశాంత్, అభి తదితరులు శాలువాతో సన్మానించి కేక్ కట్ చేసి మిఠాయి తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వారితో పాటు పలువురు మిత్రులు, శ్రేయోభిలాషులు పాల్గొని వారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పుట్టినరోజు సందర్భంగా శాలువాతో ఘనంగా సన్మానించి తమ అభిమానాన్ని, గౌరవాన్ని చాటి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, ఆకాంక్షిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.