MANA TOLIVELUGU
Newspaper Banner
Date of Publish : 04 October 2026, 7:47 pm Posted by : MANA TOLIVELUGU

ఘనంగా జాతీయ వన్యప్రాణి వారోత్సవాలు

పేరూరు ప్లాంటేషన్‌లో ఉత్సాహంగా వనదర్శిని కార్యక్రమం

మన తొలివెలుగు | వాజేడు ప్రతినిధి వై. సర్వేశ్వర రావు (04 అక్టోబర్ 20 26) : 

జాతీయ వన్యప్రాణి వారోత్సవాలను పురస్కరించుకొని వాజేడు రేంజ్ పరిధిలోని పేరూరు ప్లాంటేషన్‌లో విద్యార్థుల కోసం ప్రత్యేకంగా వనదర్శిని అవగాహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అడవుల పెంపకం, పర్యావరణ పరిరక్షణ మరియు వన్యప్రాణుల రక్షణ యొక్క ఆవశ్యకతపై విద్యార్థులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించారు. ప్రకృతి సమతుల్యతను కాపాడుకోవడంలో వన్యప్రాణుల పాత్ర ఎంతగానో ఉందని, జీవ వైవిధ్యాన్ని రక్షించుకోవడం మన అందరి ప్రాథమిక బాధ్యత అని అధికారులు విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో వాజేడు రేంజ్ ఆఫీసర్ పి. నరేందర్, సెక్షన్ ఆఫీసర్లు నారాయణ, బిక్షపతి, బీట్ ఆఫీసర్లు పద్మ, ప్రణవి, బిక్షపతి పాల్గొని అటవీ శాఖ తరఫున మార్గదర్శనం చేశారు. ఈ అవగాహన కార్యక్రమంలో ప్రభుత్వ ఆశ్రమ హైస్కూల్ పేరూరు హెడ్‌మాస్టర్ బద్రి, ఉపాధ్యాయులు నర్సింగరావు, పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు, బేస్ క్యాంపు సిబ్బంది పాల్గొన్నారు.