ఘనంగా జాతీయ వన్యప్రాణి వారోత్సవాలు

పేరూరు ప్లాంటేషన్‌లో ఉత్సాహంగా వనదర్శిని కార్యక్రమం మన తొలివెలుగు | వాజేడు ప్రతినిధి వై. సర్వేశ్వర రావు (04 అక్టోబర్ 20 26) :  జాతీయ వన్యప్రాణి వారోత్సవాలను పురస్కరించుకొని వాజేడు రేంజ్ పరిధిలోని పేరూరు ప్లాంటేషన్‌లో విద్యార్థుల కోసం ప్రత్యేకంగా వనదర్శిని అవగాహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అడవుల పెంపకం, పర్యావరణ పరిరక్షణ మరియు వన్యప్రాణుల రక్షణ యొక్క ఆవశ్యకతపై విద్యార్థులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించారు. ప్రకృతి సమతుల్యతను కాపాడుకోవడంలో వన్యప్రాణుల పాత్ర ఎంతగానో ఉందని, జీవ వైవిధ్యాన్ని రక్షించుకోవడం...