MANA TOLIVELUGU
Newspaper Banner
Date of Publish : 01 July 2026, 7:00 pm Posted by : MANA TOLIVELUGU

ఘనంగా డాక్టర్స్ డే  

మన తొలివెలుగు, యాదాద్రి భువనగిరి టౌన్ ప్రతినిధి జంగిటి రవీందర్ :

భువనగిరి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో జాతీయ డాక్టర్స్ డే ను ఘనంగా నిర్వహించారు. డాక్టర్స్ సేవలను త్యాగనిరతిని గుర్తిస్తూ పలు జిల్లా ఆసుపత్రి వైద్యులతో పాటు భువనగిరి కంటి వైద్యులు డాక్టర్ బీ.అమర్ నాథ్ ను సత్కరించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో భువనగిరి రోటరీ క్లబ్ అధ్యక్షులు కూచిపట్ల సత్యనారాయణ రెడ్డి, హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్లు కే అరుణ కుమారి, సద్గుణ చారి, ఆర్ఎంఓ డాక్టర్ జయలక్ష్మి, అనిస్తీస్య స్పందన, ఎంపాల బుచ్చిరెడ్డి, బీ.అమర్నాథ్, కార్యదర్శి కడారు రమేష్ బాబు, కోశాధికారి పెండెం వేణుగోపాల్, రోటరీ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.