MANA TOLIVELUGU
Newspaper Banner
Date of Publish : 02 June 2026, 8:36 pm Posted by : MANA TOLIVELUGU

ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య :

త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ అభివృద్ధి కోసం నేటి యువత ముందుకు రావాలని బీఆర్ఎస్ నాయకులు సూరెడ్డి కృష్ణారెడ్డి, షేక్ అప్జల్, మన్సూర్ అలీ, బర్కత్ అలీ, వాసు బాబు, యంజాల అర్జున్, మగ్ధూం పటేల్, నాగభూషణం, ఆరిఫ్ అలీ, శంకర్, తదితరులు అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని షాహీన్ నగర్ చౌరస్తాలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

తెలంగాణ పతాకాన్ని ఆవిష్కరించి తెలంగాణ గీతాన్ని ఆలపించి అమరవీరులను స్మరించుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఉద్యమ నాయకుడు, తెలంగాణ ఉద్యమ నేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యంలో ఎందరో అమరవీరుల త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని అన్నారు. త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ అభివృద్ధి కోసం, మళ్లీ భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించుకోవడానికి నేటి యువత ముందుకు రావాలని సూచించారు.