MANA TOLIVELUGU
Newspaper Banner
Date of Publish : 01 May 2026, 9:54 am Posted by : MANA TOLIVELUGU

ఘనంగా నృసింహ స్వామి జయంతి వేడుకలు

పూలమాలలతో శోభాయమానంగా ముస్తాబైన ఆలయం

మన తొలివెలుగు, చాంద్రాయణగుట్ట ప్రతినిధి శైలేష్ కుమార్

 లాల్ దర్వాజా మోడ్ సమీపంలోనీ నరసింహ స్వామి ఆలయంలో వైశాఖ శుద్ధ చతుర్దశి పురస్కరించుకుని నగరంలోని పలు ఆలయాల్లో గురువారం, శ్రీ నృసింహ స్వామి జయంతి వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాలను రంగు రంగుల పూలమాలలు, విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. గర్భగుడిలో కొలువైన స్వామి వారికి ఉదయం నుంచే పంచామృతాభిషేకం, తులసీ అర్చన, ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని వివిధ రకాల పుష్పాలతో, పండ్లతో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. హిరణ్యకశిపుని సంహరించి ప్రహ్లాదుడిని రక్షించిన నృసింహావతారం విశిష్టతను అర్చకులు భక్తులకు వివరించారు. సాయంత్రం స్వామి వారికి సహస్ర నామార్చన, వేద పారాయణం అనంతరం మహా మంగళహారతి ఇచ్చారు. జయంతి సందర్భంగా ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వందలాది మంది భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని, పానకం, వడపప్పు నైవేద్యం సమర్పించారు. ధర్మాన్ని కాపాడేందుకు, దుష్ట శిక్షణకు అవతరించిన నృసింహస్వామి అనుగ్రహం అందరిపై ఉండాలని భక్తులు ప్రార్థించారు.