ఘనంగా నృసింహ స్వామి జయంతి వేడుకలు

పూలమాలలతో శోభాయమానంగా ముస్తాబైన ఆలయం మన తొలివెలుగు, చాంద్రాయణగుట్ట ప్రతినిధి శైలేష్ కుమార్  లాల్ దర్వాజా మోడ్ సమీపంలోనీ నరసింహ స్వామి ఆలయంలో వైశాఖ శుద్ధ చతుర్దశి పురస్కరించుకుని నగరంలోని పలు ఆలయాల్లో గురువారం, శ్రీ నృసింహ స్వామి జయంతి వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాలను రంగు రంగుల పూలమాలలు, విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. గర్భగుడిలో కొలువైన స్వామి వారికి ఉదయం నుంచే పంచామృతాభిషేకం, తులసీ అర్చన, ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని వివిధ రకాల పుష్పాలతో,...