ఘనంగా మండేలా, అందెశ్రీ జయంతి వేడుకలు

మన తొలివెలుగు, ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో ప్రతినిధి ఎన్. హరీష్ :  వనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో శనివారం మహనీయుల స్ఫూర్తి వేదిక ఆధ్వర్యంలో నెల్సన్ మండేలా 108వ జయంతి, ప్రజాకవి డాక్టర్ అందెశ్రీ 65వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేదిక రాష్ట్ర చైర్మన్ రాజారాం ప్రకాష్ మాట్లాడుతూ.. జాతి వివక్షపై పోరాడిన నల్లసూర్యుడు నెల్సన్ మండేలా, తన పాటలతో తెలంగాణ ఉద్యమాన్ని ఊపిన లోకకవి అందెశ్రీల జీవితాలు సమాజానికి స్ఫూర్తిదాయకమన్నారు. అందెశ్రీ రచించిన 'జయ జయహే...