ఘనంగా ముత్యాలమ్మ తల్లి శాంతి కళ్యాణం
మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య జీహెచ్ఎంసీ మీర్ పేట్ 60వ డివిజన్ లోని కమల నెహ్రూ నగర్ కాలనీలో శ్రీ శ్రీ ముత్యాలమ్మ తల్లి దేవత పున ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా ఆదివారం అమ్మవారికి శాంతి కళ్యాణం ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు. వేద పండితులు వేద మంత్రోచరణల మధ్య అమ్మవారి కళ్యాణం కొనసాగింది. భక్తులు విచ్చేసి అమ్మవారి కళ్యాణాన్ని కనులారా వీక్షించి దన్యులయ్యారు. ఈ సందర్భంగా మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్ తీగల విక్రం...