MANA TOLIVELUGU
Newspaper Banner
Date of Publish : 19 June 2026, 2:34 pm Posted by : MANA TOLIVELUGU

ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

రాహుల్ గాంధీ 56వ జన్మదినం సందర్భంగా చాంద్రాయణగుట్టలో కాంగ్రెస్ శ్రేణుల సేవా కార్యక్రమాలు 

మన తొలివెలుగు, చాంద్రాయణగుట్ట ప్రతినిధి నార్కెట్‌పల్లి శైలేష్ కుమార్ :

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 56వ జన్మదినాన్ని చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో కాంగ్రెస్ శ్రేణులు శుక్రవారం నిర్వహించి పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు . చాంద్రాయణగుట్ట కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, కంటెస్టెడ్ ఎమ్మెల్యే, బోయ నాగేష్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు, గర్భిణీ స్త్రీలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బోయ నాగేష్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ పుట్టినరోజును సేవా దినంగా జరుపుకోవాలన్నారు. దేశం కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడుతున్న రాహుల్ గాంధీ ఆశయ సాధనకు తామంతా కట్టుబడి ఉన్నామన్నారు. అందులో భాగంగా రోగులకు, గర్భిణులకు పౌష్టికాహారంగా పండ్లు అందజేశామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. అలేఖ్య, పీసీసీ రాష్ట్ర కార్యదర్శులు పర్వతాల రాజేందర్, బీ. వెంకటేష్ ముదిరాజ్, డీసీసీ జిల్లా అధ్యక్షుడు ఖలేద్ సైఫ్ ఉల్లా, జిల్లా కార్యదర్శులు పర్వతాల సాయి ఉదయ్, మోహన్ రెడ్డి, జీ. నరసింహ, డివిజన్ అధ్యక్షుడు శ్రీశైలం గౌడ్, జంగంమెట్ ఇంచార్జి ప్రమోద్ రెడ్డి, బ్లాక్ ప్రెసిడెంట్ అనిల్ కుమార్, ఘాజీమిల్లత్, డివిజన్ అధ్యక్షుడు రాము, చాంద్రాయణగుట్ట శ్రీ చెన్నకేశవ ఆలయ చైర్మన్ మహేష్ గౌడ్, శామ్, లెనిన్ బాబు, లక్ష్మణ్ చారి, స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, డాక్టర్లు, ఆసుపత్రి వైద్య సిబ్బంది పాల్గొన్నారు.