MANA TOLIVELUGU
Newspaper Banner
Date of Publish : 04 June 2026, 7:49 pm Posted by : MANA TOLIVELUGU

ఘనంగా స్ప్రింట్ డయాగ్నస్టిక్స్ మొదటి వార్షికోత్సవం 

ముఖ్య అతిధిగా హాజరైన బీఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కే.పీ వివేకానంద్ 

మన తొలివెలుగు, కుత్బుల్లాపూర్ ప్రతినిధి టీ. రమేష్ :

జీడిమెట్ల డివిజన్ సుచిత్రలోని స్ప్రింట్ డయాగ్నస్టిక్స్ మొదటి వార్షికోత్సవ కార్యక్రమానికి బీఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కే.పీ వివేకానంద్ ముఖ్యఅతిధిగా హాజరై జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైద్యరంగంలో రోజురోజుకూ పెరుగుతున్న సాంకేతిక మార్పులతో రోగ నిర్ధారణ, రోగానికి చికిత్సలో బయో ఫైర్ అనే నూతన టెక్నాలజీతో అత్యుత్తమ సేవలను అందించడం ప్రజల పట్ల వారికి ఉన్న సేవా దృక్పదాన్ని తెలియజేస్తుందన్నారు. ప్రజా సేవలో అద్భుత టెక్నాలజీతో ముందుకు సాగుతున్న స్ప్రింట్ డయాగ్నొస్టిక్స్ మరింత అభివృద్ధి చెందాలన్నారు. అనంతరం స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్ ఆధ్వర్యంలో నూతనంగా రూపొందించిన వెల్నెస్ ఫ్యామిలీ కార్డ్ ను ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో స్ప్రింట్ డయాగ్నొస్టిక్ ఎం.డి డాక్టర్ భరత్ రెడ్డి, స్ప్రింట్ డయాగ్నొస్టిక్ సీఈవో తరుణ్ ఆదిత్య, డాక్టర్ చంద్ర శేఖర్ రెడ్డి, డాక్టర్ కార్తీక్, ల్యాబ్ డైరెక్టర్ డాక్టర్ లక్ష్మీ, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు సంపత్ మాధవరెడ్డి, కుంట సిద్ధిరాములు, సుధాకర్ గౌడ్, జ్ఞానేశ్వర్ ముదిరాజ్, నరేందర్ రెడ్డి, సమ్మయ్య నేత, ఆటో బలరాం, నదీమ్ రాయ్, చంద్ర శేఖర్ రెడ్డి, కాలే గణేష్, బాల మల్లేష్, శ్రీకాంత్, విజయ్ హరీష్, డీజే రమేష్, బాబీ, మహేష్, మహిళా నాయకురాలు ఇందిరా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.