చందనం చెరువులో గుర్రపు డెక్క తొలగింపు కార్యక్రమం ప్రారంభించిన అధికారులు
జిల్లెలగూడ పరిసర ప్రాంతాల ప్రజలు ఇక ఊపిరి పీల్చుకోండి ఇక దోమల బెడద తప్పినట్లేనని హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య జీహెచ్ఎంసీ పరిధిలోని చందన చెరువులో గుర్రపు డెక్క పూర్తిగా నిండిపోవడంతో దోమల బెడద తీవ్రమైంది. స్థానికంగా దోమలు స్వైర విహారం చేయడంతో ఇక్కడి ప్రజలు బెజారయ్యారు. దోమలు విపరీతంగా పెరిగిపోయి స్థానిక ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేశాయి. దోమకాటుకు గురై ప్రజలు రోగాలబారిన పడుతున్నా పట్టించుకునేవారే లేరని జిల్లెలగూడ వాసులు మండిపడ్డారు. ముఖ్యంగా...