MANA TOLIVELUGU
Newspaper Banner
Date of Publish : 16 May 2026, 5:49 pm Posted by : MANA TOLIVELUGU

చందనం చెరువులో గుర్రపు డెక్క తొలగింపు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

కేసీఆర్ హయంలో చెరువుల సుందరీకరణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ చెరువుల పరిరక్షణను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని జిల్లెలగూడ డివిజన్‌లో ఉన్న చందనం చెరువు పూర్తిగా గుర్రపు డెక్కతో నిండిపోవడంతో, చెరువులో గుర్రపు డెక్క తొలగింపు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు హయాంలో చెరువుల సుందరీకరణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పడి మూడు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ చెరువుల పరిరక్షణను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. చెరువులు మురికి కూపాలుగా మారిపోతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని, గుర్రపు డెక్క విపరీతంగా పెరగడంతో దోమల సమస్య అధికమై ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఎన్నిసార్లు అధికారులకు ఆదేశాలు ఇచ్చినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుగా పరిస్థితి కొనసాగుతోందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరిచి హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్న అన్ని చెరువులను శుభ్రపరచి, గుర్రపు డెక్కను తొలగించి, చెరువుల సుందరీకరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో బడంగ్‌పేట్ డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య, బీఆర్ఎస్ నాయకులు అర్కల కామేష్ రెడ్డి, భూపాల్ రెడ్డి, ఏనుగుల అనిల్ కుమార్ యాదవ్, సిద్దాల పెద్ద బీరప్ప, సిద్దాల బీరప్ప, సునీత బాలరాజ్, దీప్లాల్ చౌహాన్, మాదిరి రమేష్, శీను నాయక్, బొమ్మరగోని యాదగిరి, పోరెరెడ్డి భాస్కర్ రెడ్డి, సుర్వి లతా శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.