చందనం చెరువులో గుర్రపు డెక్క తొలగింపు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

కేసీఆర్ హయంలో చెరువుల సుందరీకరణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ చెరువుల పరిరక్షణను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని జిల్లెలగూడ డివిజన్‌లో ఉన్న చందనం చెరువు పూర్తిగా గుర్రపు డెక్కతో నిండిపోవడంతో, చెరువులో గుర్రపు డెక్క తొలగింపు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర...