చంద్రబాబు తొత్తుగా రేవంత్ రెడ్డి
యాదగిరిగుట్ట బోర్డు నియామకంపై మండిపడ్డ బీఆర్‌ఎస్ నాయకులు మన తొలివెలుగు, మోత్కూర్ ప్రతినిధి పబ్బు ప్రవీణ్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వందకు వంద శాతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కనుసన్నల్లోనే పని చేస్తూ తొత్తుగా వ్యవహరిస్తున్నారని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొణతం యాకుబ్ రెడ్డి, మండల అధ్యక్షుడు పొన్నేబోయిన రమేష్ తీవ్రంగా విమర్శించారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ట్రస్ట్ బోర్డు నియామకమే ఇందుకు నిదర్శనమని వారు మండిపడ్డారు. మున్సిపాలిటీ అధ్యక్షుడు జంగ శ్రీను, రైతుబంధు మాజీ...