చిన్నారులకు రెండు చుక్కలు రక్షణ కవచంలా పనిచేస్తాయి
మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య ముదిరాజ్ చిన్నారులకు రెండు పోలియో చుక్కలు రక్షణ కవచంలా పనిచేస్తాయని మాజీ కౌన్సిలర్ లక్ష్మీనారాయణ తెలిపారు. శ్రీరామ కాలనీ ప్రభుత్వ దవాఖానలో ఆయన చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి తల్లిదండ్రులు తమ తమ 5 ఏళ్ల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలని కోరారు. పిల్లల నిండు జీవితానికి ఈ రెండు చుక్కలు రక్షణ కవచంలా పనిచేస్తాయని కోరారు. ఒక్క చిన్నారి కూడా మిగిలిపోకుండా చూడటమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. తల్లిదండ్రులు...