MANA TOLIVELUGU
Newspaper Banner
Date of Publish : 01 July 2026, 8:34 pm Posted by : MANA TOLIVELUGU

చిన్న పోతులపాడు శివారులో పేకాట స్థావరంపై పోలీసుల దాడి

మన తొలివెలుగు, ఆలంపూర్ ప్రతినిధి డేవిడ్ :

మానపాడు మండలం చిన్న పోతులపాడు గ్రామ శివారులో పేకాట నిర్వహిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు మనపాడు ఎస్‌ఐ స్వాతి ఆధ్వర్యంలో పోలీసులు దాడి నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి నాలుగు ద్విచక్ర వాహనాలు, ఐదు మొబైల్ ఫోన్లు, 52 పేక ముక్కలు, నగదు రూ.4, 280 స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ స్వాతి తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఆమె వెల్లడించారు.