MANA TOLIVELUGU
Newspaper Banner
Date of Publish : 14 May 2026, 3:57 pm Posted by : MANA TOLIVELUGU

చెరువులలో పెరుగుతున్న గుర్రపు డెక్క తో ప్రజలు పరేషాన్

కాంగ్రెస్ ప్రభుత్వ మాత్రం చెరువులను విస్మరించి ప్రజల ఆరోగ్యాలతో, ప్రాణాలతో చెలగాటమాడుతుంది

 

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య

 

చెరువులలో పెరుగుతున్న గుర్రపు డెక్క తో దోమలు వృద్ధి చెందడం ముక్కు పుటలు అదిరిపోయే దుర్గంధమైన వాసన రావడంతో ప్రజలు పరేషాన్ అవుతున్నారనీ మీర్పేట్ బీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు అర్కల కామేష్ రెడ్డి అన్నారు. శంషాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలోని చందనం చెరువు, మంత్రాల చెరువు, పెద్ద చెరువులను మీర్ పేట్  బీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు అర్కల కామేష్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి  చెరువుల వద్ద పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు చెరువుల సందర్శన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. చెరువులలో విస్తరించిన గుర్రం డెక్క, చెత్త చెదారంతో పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతున్నాయని దీనివల్ల దోమలు క్రిమి కీటకాలు వ్యాప్తి చెంది ప్రజలు రోగాల బారిన పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో చెరువులను సుందరీకరణ కార్యక్రమాల నిర్వహించి ప్రజలకు ఆహ్లాదకర వాతావరణ ఏర్పాటు చేశారనీ గుర్తుచేశారు. దీంతో వందలాదిమంది వాకర్లు చెరువు చుట్టూ వాకింగ్ చేస్తుంటారు అన్నారు. జిమ్ చేస్తుంటారు అన్నారు. పోలీస్ ట్రైనింగ్ చేసే యువకులు ఇక్కడికి వచ్చి వ్యాయామం ఎక్సర్సైజులు చేస్తుంటారు అన్నారు. చెరువులో గుర్రపు డెక్క పెరగడమే కాక అది ఇంకా పూత పూస్తుంది. దీంతో దోమలు అంటే దోమలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ముక్కు పుటలు అదిరి దుర్వాసన ఘోరంగా వ్యాపిస్తుంది. ఇక్కడికి వచ్చినవాళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయడం లేదని అసహించుకుంటున్నారని ఆయన తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ మాత్రం చెరువులను విస్మరించి ప్రజల ఆరోగ్యాలతో, ప్రాణాలతో చెలగాటమాడుతుందనడానికి ఈ చెరువులే నిదర్శనం అన్నారు. చెరువులలో గుర్రం డెక్క, చెత్త చెదారం పేరుకుపోయి ప్రజలు రోగాల బారిన పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి చెరువులను వారం 10 రోజులలో గుర్రం డెక్క, చెత్త చెదారం నివారణకు చర్యలు చేపట్టి ప్రజల ఆరోగ్యాలను, ప్రాణాలను కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కలిసి పెద్ద మొత్తంలో ధర్నా నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు భూపేష్ గౌడ్ ,అనిల్ కుమార్ యాదవ్, సిద్ధాల బీరప్ప, సునీతా బాలరాజ్, మాధవి ,బిందు ,లక్ష్మణ్ ముదిరాజ్,సంతోష్ ,యాదగిరి రెడ్డి, రవీందర్ రెడ్డి, చారి, రజాక్ బాయ్, సిద్దాల భారత్, దయానంద్, జగాల్ రెడ్డి,శాంతమూర్తి తదితరులు పాల్గొన్నారు.