MANA TOLIVELUGU
Newspaper Banner
Date of Publish : 11 June 2026, 10:02 pm Posted by : MANA TOLIVELUGU

ఛత్రినక చౌరస్తాలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం

క్షేత్రస్థాయిలో పరిశీలించిన డీసీపీ రాహుల్ హెగ్డే

మన తొలివెలుగు, చాంద్రాయణగుట్ట ప్రతినిధి నార్కెట్‌పల్లి శైలేష్ కుమార్ :

పాతబస్తీ  ఛత్రినక చౌరస్తా ప్రధాన రహదారిలో ప్రతినిత్యం ఏర్పడుతున్న ట్రాఫిక్ జామ్‌కు శాశ్వత పరిష్కారం కనుగొనేందుకు సౌత్ జోన్ డీసీపీ రాహుల్ హెగ్డే స్వయంగా రంగంలోకి దిగారు. హెచ్ఏండబ్ల్యూఎస్ఎస్బీ డిప్యూటీ జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ తో పాటు, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులతో కలిసి చౌరస్తా వద్ద సమస్యను స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. చౌరస్తా వద్ద రోడ్డు తవ్వకాలు, డ్రైనేజీ పనుల వల్ల ఏర్పడుతున్న రద్దీ, అక్రమ పార్కింగ్ నియంత్రణ కు చేపట్టాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. జీహెచ్ఎంసీ, హెచ్ఏండబ్ల్యూ ఎస్స్బీ వేగవంతంగా పనులు పూర్తి చేసి రోడ్డును యథావిధిగా పునరుద్ధరించాలని కోరారు. ట్రాఫిక్ పోలీసుల సిబ్బందినీ కూడ పెంచుతామని స్ఫష్టం చేశారు. చార్మినార్ జోన్ ట్రాఫిక్ ఏసీపీ కే లక్ష్మణ్, ఛత్రినాక సీఐ ఎస్.సంతోష్ లు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసేలా చూడాలని డీసీపీ రాహుల్ హెగ్డే సూచించారు.