MANA TOLIVELUGU
Newspaper Banner
Date of Publish : 14 May 2026, 8:15 pm Posted by : MANA TOLIVELUGU

జనం మధ్య కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి

కిక్కిరిసిన కార్యాలయం- ప్రతీ ఒక్కరితో మాటామంతి

 

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య

 

జనం చుట్టి ముట్టి సమస్యలు చెబుతుంటే సావదానంగా వింటూ ఒక్కొక్కరి సమస్య పరిష్కరిస్తూ మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి ముందుకు సాగుతున్నారు. తుక్కుగూడ కార్యాలయం సమస్యలతో వచ్చే ప్రజలతో కిక్కిరిసిపోయింది. కేఎల్ఆర్ వస్తున్నారంటే మహేశ్వరం నియోజకవర్గం నుంచి తండోప తండాలుగా ప్రజలు తరలివచ్చారు. భూ సమస్యలు, రైతు సమస్యలు, డబుల్ బెడ్ రూమ్స్, విద్యుత్, పోలీస్, సీఎంఆర్ఎఫ్ రెవెన్యూ సమస్యలపై లక్ష్మారెడ్డిని కలిశారు. అనేక సమస్యలపై వచ్చే ప్రజల ఇబ్బందులను ఓపికగా వింటూ… సంబంధిత అధికారులతో సంప్రదింపులు చేసి పరిష్కరించాలని కోరారు. సేవకుడే నాయకుడు అన్న నినాదంతో నిరంతరం ప్రజల మధ్య ఉండే కిచ్చెన్న జనసేనానిగా మహేశ్వరం నియోజకవర్గంలో గుర్తింపు పొందుతున్నారు.