జర్నలిజం ముసుగులో ప్రభుత్వ భూమి కబ్జా..!
కబ్జా భూమిలో పంద్రాగస్టు వేడుకలు.. అధికారుల మౌనం ఎందుకు? మన తొలివెలుగు రంగారెడ్డి జిల్లా: జర్నలిజం ముసుగులో ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయనే ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ భూమికి సంబంధించి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నప్పటికీ రెవెన్యూ, మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కబ్జాకు గురైందని ఆరోపిస్తున్న భూమిలోనే పంద్రాగస్టు వేడుకలు నిర్వహించడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఈ భూమితో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులకు రాజకీయ, అధికార వర్గాల అండదండలు ఉన్నాయా? అన్న...