జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత విద్య

ప్రొసీడింగ్ అందజేసిన డీఈఓ విజయలక్ష్మి మన తొలివెలుగు, ఆలంపూర్ నియోజకవర్గ ప్రతినిధి డేవిడ్ : జోగులాంబ గద్వాల జిల్లాలో వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత విద్యను అందించుటకు జిల్లా విద్యాశాఖ అధికారిని విజయలక్ష్మి ప్రొసీడింగ్స్ ను బుధవారం జర్నలిస్టులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలోని అనేక మంది జర్నలిస్టులు నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారని, పత్రికలు, టీవీ యాజమాన్యాల నుంచి తగిన ఆర్థిక సహాయం అందకపోవడంతో కుటుంబ పోషణతో పాటు పిల్లల విద్యాభారం మోయడం కష్టంగా మారిందని తెలిపారు....