జల్ పల్లి సర్కిల్ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ 

తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జల్ పల్లి సర్కిల్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ వెంకట్రావు ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కొబ్బరికాయలు కొట్టి, అంబేద్కర్, జయశంకర్ సార్, మహాత్మా గాంధీ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కమిషనర్ జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ అధికారులు, మాజీ కౌన్సిలర్లు షేక్ అప్జల్, శంషుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.