MANA TOLIVELUGU
Newspaper Banner
Date of Publish : 21 May 2026, 9:45 pm Posted by : MANA TOLIVELUGU

డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలి 

జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

మన తొలివెలుగు, యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో ప్రతినిధి జంగిటి రవీందర్

డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత అధికారులు ఆదేశించారు. గురువారం బీబీనగర్ మండల కేంద్రంలో కొండమడుగు, బీబీనగర్ గ్రామంలో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అనురాగ్ జయంతి పరిశీలించారు. ఈ సందర్భంగా ఇండ్ల నిర్మాణాల పురోగతి, మౌలిక వసతుల కల్పన, పెండింగ్ పనులను సంబధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. కొండమడుగు గ్రామంలో మొత్తం ఎన్ని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించారో, ప్రస్తుతం ఎన్ని ఇండ్లు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నాయో అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఇంకా ఎలాంటి పనులు పెండింగ్‌లో ఉన్నాయో వివరాలు కోరారు. ముఖ్యంగా కరెంటు కనెక్షన్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైప్‌లైన్, నీటి సరఫరా వంటి మౌలిక వసతుల పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న విద్యుత్ మరియు డ్రైనేజీ పనులను వెంటనే ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఇండ్ల నిర్మాణాలను పూర్తిచేసి అర్హులైన లబ్ధిదారుల ఎంపిక నిష్పాక్షికంగా చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ అలివేలు, నిజంగా ఈ శ్రీరాములు, పంచాయతీరాజ్ అధికారి దాసయ్య మండల తాసిల్దారులు పాల్గొన్నారు.