MANA TOLIVELUGU
Newspaper Banner
Date of Publish : 27 May 2026, 8:36 pm Posted by : MANA TOLIVELUGU

తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి

అంజయ్య నగర్‌లో పాదయాత్ర చేసిన జే.కే శేఖర్ యాదవ్

మన తొలివెలుగు: కుత్బుల్లాపూర్ ప్రతినిధి రమేష్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్ జే.కే శేఖర్ యాదవ్ జగద్గిరిగుట్ట 280 వ డివిజన్ అంజయ్య నగర్‌లో పాదయాత్ర నిర్వహించారు. బస్తీ వాసుల కోరిక మేరకు ఆయన అక్కడి ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని స్థానికులు తెలిపారు. కొత్త బోర్ వేయించడంతో పాటు పాత బోర్లను మరమ్మతులు చేయించాలని వారు కోరారు. దీనిపై స్పందించిన శేఖర్ యాదవ్ సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే కొత్త బోర్ ఏర్పాటు విషయాన్ని ఎంపీ ఈటెల రాజేందర్ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమని, కాలనీలో అవసరమైన మౌలిక సదుపాయాల కోసం నిరంతరం కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అరుణ్, శ్రీహరి, రమేష్, జగన్ ముదిరాజ్, ముత్యాలు, బస్తీ వాసులు తదితరులు పాల్గొన్నారు.