MANA TOLIVELUGU
Newspaper Banner
Date of Publish : 27 May 2026, 7:26 pm Posted by : MANA TOLIVELUGU

తెలంగాణ యువత ఫిట్ గా ఉండేందుకు క్రీడా కాంప్లెక్స్ లను సద్వినియోగం చేసుకోవాలి 

బీఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కే.పీ. వివేకానంద్ 

మన తొలివెలుగు : కుత్బుల్లాపూర్ ప్రతినిధి రమేష్

గాజుల రామారం సర్కిల్ పరిధి గాజుల రామారం డివిజన్ లోని జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను జీహెచ్ఎంసీ అధికారులతో సందర్శించిన బీఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కే.పీ.వివేకానంద్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో కొనసాగుతున్న నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ యువత మానసికంగా దృఢత్వంతో పాటు శారీరకంగా దృఢత్వంగా ఉండాలనే లక్ష్యంతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణ పనులను చేపట్టామని అన్నారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో బ్యాడ్మింటన్, రన్నింగ్ ట్రాక్, ఫుట్ బాల్, యోగ సెంటర్ తో పాటు ఆహ్లాదకరమైన వాతావరణంలో వ్యాయామం చేసుకోవడంతో పాటు ఛాంపియన్ షిప్ లను సైతం నిర్వహించేలా స్పోర్ట్స్ కాంప్లెక్స్ పనులను చేపడుతున్నామని తెలిపారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణ పనులను త్వరతగతిన పూర్తి చేసి క్రీడాకారులకు, సమీప కాలనీల వాసులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను అదేశించారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ హరిప్రసాద్, డీ.ఈ అనురాగ్, ఏ.ఈ కళ్యాణ్, యూబీడీ సర్కిల్ మేనేజర్ విజయ రాణి, పలు సంక్షేమ సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.