తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్దపీట
మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య ముదిరాజ్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి అన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని బాలాపూర్ డివిజన్ లో మహిళలకు ఆమె చేతుల మీదుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ చీరలను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రతి మహిళకు చీర అందించాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మహిళల అభ్యున్నతికి తమ ప్రభుత్వం...