తెలంగాణ రాష్ట్రానికి అమ్మ పునర్జ జన్మనిచ్చింది
తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడేది కవితమ్మ కాబట్టే తెలంగాణ రక్షణ సేన పేరుతో కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు ఇవ్వడం పట్ల కప్పాటి పాండురంగారెడ్డి హర్షం
మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య
తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంలో నేడు ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైందని సామాజిక తెలంగాణ సాధనే ఏకైక ధ్యేయంగా స్థాపించుకున్న ‘తెలంగాణ రక్షణ సేన’ (టీఆర్ఎస్) పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) అధికారికంగా ఆమోద ముద్ర కల్పించడంతో తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కప్పాటి పాండు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు రామిడి వెంకట్ రెడ్డి, జిల్లా రైతు విభాగం అధ్యక్షులు మంచిరెడ్డి విజయ్ కిరణ్ రెడ్డి హర్ష వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ నెల 25వ తేదీన మేడ్చల్ లోని అద్వయ కన్వెన్షన్ లో జరిగిన సభలో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావాన్ని జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, కల్వకుంట్ల కవిత ప్రకటించిన విషయం తెలిసిందే అన్నారు. నాటి ఆ ప్రకటనకు నేడు చట్టబద్ధత లభించడం గర్వకారణంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర సేనకు బదులుగా తెలంగాణ రక్షణ సేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపును ఇవ్వడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. బంజారాహిల్స్ లోని కవిత నివాసంలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు స్వయంగా విచ్చేసి, పార్టీకి ఆమోదం తెలుపుతూ.. తెలంగాణ రక్షణ సేన పార్టీకి అధికారిక లేఖను అందజేశారన్నారు. ఇది తెలంగాణ ప్రజానీకం ఆకాంక్షలకు దక్కిన తొలి విజయమన్నారు.
సబ్బండ వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ‘తెలంగాణ రక్షణ సేన’ పార్టీ “పాంచజన్యం” పేరుతో ఐదు ప్రధాన అంశాలతో ముందుకు వెళుతుందన్నారు.
కేజీ నుంచి పీజీ వరకు ప్రతి బిడ్డకూ నాణ్యమైన ఉచిత విద్య. పేదలందరికీ కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్య సేవలు.
అన్నదాతలకు 24 గంటల ఉచిత విద్యుత్, వ్యవసాయానికి పూర్తిస్థాయి మద్దతు.
సింగిల్ నోటిఫికేషన్ ద్వారా 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, యువతకు రూ. 2 లక్షల నుండి రూ. 20 కోట్ల వరకు స్వయం ఉపాధి రుణాలు.
అన్ని వర్గాలకు సమన్యాయం, రాజకీయ పాలనలో సమాన ప్రాధాన్యత టీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమన్నారు.
ఈ చారిత్రాత్మక నిర్ణయానికి ఆమోదం తెలిపిన కేంద్ర ఎన్నికల సంఘానికి వారు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల గొంతుకను వినిపించేందుకు, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు పుట్టిన ఈ తెలంగాణ రక్షణ సమితి (టీఆర్ఎస్) పార్టీ తెలంగాణ భవిష్యత్తును పునర్ నిర్మిస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.