MANA TOLIVELUGU
Newspaper Banner
Date of Publish : 15 October 2026, 9:36 pm Posted by : MANA TOLIVELUGU

దేవీనవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న జక్కిడి రఘువీర్ రెడ్డి

అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరికీ సుఖసంతోషాలు కలగాలి – జక్కిడి రఘువీర్ రెడ్డి

మన తొలివెలుగు | ఎల్బీనగర్:

దేవీనవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని లింగోజిగూడ, లెక్చరర్స్ కాలనీ, జీఎస్ఐ, మన్సూరాబాద్ డివిజన్లలోని పలు కాలనీల్లో ప్రతిష్ఠించిన అమ్మవారి విగ్రహాలను జక్కిడి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జక్కిడి రఘువీర్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అన్నప్రసాద వితరణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారి ఆశీస్సులతో ప్రతి ఇంటా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ప్రజలందరి జీవితాల్లో శాంతి, సౌభాగ్యం, విజయాలు కలగాలని, సమాజంలో సుఖశాంతులు, ఐకమత్యం వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. దేవీనవరాత్రి ఉత్సవాలు భక్తిభావాన్ని, ఆధ్యాత్మిక చింతనను పెంపొందించడంతో పాటు ప్రజల మధ్య ఐక్యత, సోదరభావాన్ని బలోపేతం చేస్తాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అమ్మవారి కృపాకటాక్షాలు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు.