దేశానికి తలమానికంగా నూతన ఫ్యూచర్ సిటీ
ఫార్మా వద్దు - గ్రీన్ ఫార్మా ముద్దు అంటూ నినాదించిన కాంగ్రెస్ శ్రేణులు మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య ముదిరాజ్ : భారతదేశానికి తలమానికంగా ఉండేలా, ప్రతి ఒక్కరికీ భవిష్యత్ నిచ్చే నగరంగా ఫ్యూచర్ సిటీ నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సన్నధ్ధమవుతోందని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు. ఈనెల 10న సీఎం రేవంత్ రెడ్డి రాక సందర్భంగా మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు...