ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల గోస – ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలి.     

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య  పండించిన పంటను అమ్ముకోవడానికి అన్నదాతలు పడిగాపులు కాస్తున్నా, సంబంధిత ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోకపోవడం అత్యంత దురదృష్టకరమని రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్, తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీ నాయకులు కప్పాటి పాండురంగా రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షపాతి అని గొప్పలు చెప్పుకుంటున్నా, క్షేత్రస్థాయిలో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద పరిస్థితి మాత్రం దారుణంగా ఉన్న సందర్భంగా ఆయన కందుకూరు మండల కేంద్రంలో మాట్లాడుతూ.. జిల్లాలోని పలు మండలాల్లో...