MANA TOLIVELUGU
Newspaper Banner
Date of Publish : 07 May 2026, 9:08 pm Posted by : MANA TOLIVELUGU

ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రోడ్డెక్కిన రైతులు

తుక్కాపూర్ ఎక్స్ రోడ్ పై మహాధర్న

మన తొలి వెలుగు, యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో ప్రతినిధి జంగిటి రవీందర్ 

 

ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు రోడ్డెక్కారు. గురువారం భువనగిరి మండలం తుక్కాపూర్ గ్రామ సర్పంచ్ బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు జనగాం పాండు ఆధ్వర్యంలో తుక్కాపూర్ ఎక్స్ రోడ్, నల్లగొండ రోడ్డు పైన ధాన్యం బస్తాలతో రైతులు, బీజేపీ నాయకులు మహాధర్నకు దిగారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం మొండి వైఖరి మాని రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని నినాదాలు చేశారు. ఈ ప్రాంతం ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి రైతులను పట్టించుకోకుండా రైస్ మిల్లలతో కుమ్ముకై రైతులను మోసం చేస్తున్నాడని ఆరోపించారు. వడ్లు క్వింటలుకు 3కేజీలు కటింగ్ చేస్తూ తప్పుడు హామీలు ఇస్తు మోసం చేస్తున్నారని వాపోయారు. తక్షణమే రైతుల వద్ద వడ్లు కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాస్తారోకోతో రోడ్డుపై వాహనాలు భారీగా నిలిచిపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. పోలీసులు అధికారులు రైతులకు నచ్చజెప్పి రాస్తారోకో వీరమింప చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నోముల మహేందర్ రెడ్డి, పుట్ట వీరేష్ యాదవ్, మాజీ ఎంపీటీసీ రాసాల మల్లేష్ యాదవ్, నల్లమస సత్యనారాయణ గౌడ్, గ్రామ ఉప సర్పంచ్ రాసాల లింగస్వామి యాదవ్, వార్డ్ మెంబర్స్, ఎల్లంకొండ రాజశేఖర్ రెడ్డి, వల్లపు సతీష్ యాదవ్ రత్నాపురం శ్రీకాంత్, ముంత కృష్ణవేణి, దోమటి దేవేందర్, జనగాం యాదగిరి, గ్రామ శాఖ అధ్యక్షుడు. రాసాల శేఖర్ యాదవ్, బిజెపి నాయకులు ఎల్లంకొండ సుధాకర్ రెడ్డి, కంఠం రాజమోహన్, నాయకులు పడమటి జైపాల్ రెడ్డి, జక్కిడి రాజశేఖర్ రెడ్డి, ఎదునూరి వెంకయ్య, చంద్రపాల్, కాసాని వెంకటేష్, రైతులు ప్రజలు పాల్గొన్నారు.