MANA TOLIVELUGU
Newspaper Banner
Date of Publish : 24 June 2026, 6:59 pm Posted by : MANA TOLIVELUGU

నల్ల పోచమ్మ ఆలయంలో ఆకట్టుకున్న అఖిల డాన్స్ అకాడమీ విద్యార్థుల నృత్య ప్రదర్శన 

మన తొలివెలుగు, చాంద్రాయణగుట్ట ప్రతినిధి శైలేష్ కుమార్ :

ఉప్పుగూడ హనుమాన్ నగర్ శ్రీ నల్ల పోచమ్మ దేవాలయ నూతన శివలింగ, మహోత్సవాల సందర్భంగా అఖిల డాన్స్ అకాడమీ విద్యార్థినులు సంప్రదాయ నృత్య ప్రదర్శన చేశారు. ఆలయ ప్రాంగణంలో అమ్మవారి సన్నిధిలో కూచిపూడి, జానపద నృత్య రూపాలతో చిన్నారులు అలరించారు. రంగురంగుల సంప్రదాయ వస్త్రధారణలో విద్యార్థినులు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి అకాడమీ నిర్వాహకురాలు అఖిల, బీసీ సంక్షేమ సంఘం హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి ఏ. సాయి కృష్ణ, ఆలయ కమిటీ అధ్యక్షుడు ఆశిష్ దుబే, విజయ్ పోతరాజు, పూజారులు రంగ చార్యులు, ఆలయ అర్చకులు జనగాం సిద్ధార్థ్, హాజరయ్యారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, విద్యార్థినులకు ఆశీర్వచనం అందించారు. సంస్కృతి, సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించేలా చిన్నారులకు శిక్షణ ఇస్తున్న అఖిల డాన్స్ అకాడమిని పలువురు అభినందించారు.