నారాయణ.. నారాయణ..!
నారాయణ దాస్టికం..? దిల్‌సుఖ్‌నగర్, కొత్తపేట నారాయణ బ్రాంచ్‌లలో ఫ్యాకల్టీల తొలగింపుపై ఆరోపణలు మన తొలివెలుగు హైదరాబాద్ : దిల్‌సుఖ్‌నగర్, కొత్తపేట ప్రాంతాల్లోని నారాయణ జూనియర్ కాలేజీ బ్రాంచ్‌లలో అకాడమిక్ ఇయర్ మధ్యలోనే పలువురు అధ్యాపకులను తొలగిస్తున్నారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఎలాంటి ముందస్తు కారణాలు, సరైన వివరణ లేకుండానే ఉద్యోగాల నుంచి తొలగించడంతో పదుల సంఖ్యలో కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. అధ్యాపకుల ఆరోపణల ప్రకారం, ఒప్పంద నిబంధనల మేరకు ఉద్యోగం నుంచి తొలగించే సందర్భంలో మూడు...