నిరసనకారులపై లాఠీచార్జీ దుర్మార్గం
మన తొలివెలుగు, ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో ప్రతినిధి ఎన్. హరీష్ : ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న పర్యావరణ ఉద్యమకారుడు సోనం వాంగ్‌చుగ్‌పై పోలీసులు లాఠీచార్జీ చేయడాన్ని సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ జిల్లా కమిటీ ఖండించింది. సోమవారం వనపర్తి జిల్లా కేంద్రంలో నిర్వహించిన నిరసనలో పార్టీ జిల్లా కార్యదర్శి సి. హనుమంతు మాట్లాడుతూ.. లడఖ్ పరిరక్షణ, నిరుద్యోగ సమస్యలపై ప్రశ్నిస్తున్న వారిపై కేంద్రం నిర్బంధం ప్రయోగించడం దుర్మార్గమన్నారు. పేపర్ లీకేజీలకు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా...