నీటి సరఫరాలో అంతరాయం లేకుండా నిరంతరం సరఫరా చేయాలి – అధికారులను ఆదేశించిన జోనల్ కమిషన్ కే చంద్రకళ
మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి, ముత్తయ్య వేసవి హకాలం పూర్తయ్యే వరకు శంషాబాద్ జోన్‌లో నీటి సరఫరాలో అంతరాయం లేకుండా నిరంతర సరఫరా కొనసాగించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని జోనల్ కమిషనర్ కే. చంద్రకళ నీటి సరఫరా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నీటి సరఫరా వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు జోనల్ కమిషనర్ కే. చంద్రకళ ఆధ్వర్యంలో హైదరాబాదు మెట్రోపాలిటన్ వాటర్ సప్లై హెచ్ ఎం డబ్ల్యు ఎస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో శంషాబాద్ జోన్‌కు సంబంధించిన నీటి సరఫరా...