మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య
విద్యార్థుల భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దేందుకు, వారికి నాణ్యమైన విద్యను అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని శ్రీ విద్యా భారతి హై స్కూల్ చైర్మన్ రాజు తెలిపారు. పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో జల్పల్లి డివిజన్ పరిధి శ్రీరామ కాలనీలోని శ్రీ విద్యా భారతి హై స్కూల్ కు చెందిన 6 గురు విద్యార్థులు విజయ ఢంకా మోగించారు. మిగతా విద్యార్థులు కూడా అత్యుత్తమ మార్కులు సాధించినట్లు స్కూల్ చైర్మన్ రాజు, ప్రిన్సిపల్ భీమ్ తెలిపారు. 600 మార్కులకు గాను వై. అక్షయ 549, కిరణ్ కుమావత్ 531, యు. శ్రావ్య 530, పి. మనిషా 527, ప్రగతి 525, పి. సంజన 524 మార్కులు సాధించి అగ్రగామిగా నిలిచారు. శ్రీ విద్యా భారతి హై స్కూల్ చైర్మన్ రాజు, ప్రిన్సిపల్ భీమ్, ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు. పై చదువుల్లో కూడా అత్యుత్తమ ఫలితాలు సాధించి భవిష్యత్తులో ఐఏఎస్, ఐపీఎస్, ఇంజనీరింగ్, సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా స్థిరపడి భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దుకోవాలని కోరుకున్నారు.