పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలి
సీపీఎం ప్రతినిధి బృందం డిమాండ్ మన తొలివెలుగు, ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో ఎన్. హరీష్ : వనపర్తి జిల్లా ఏదుల మండల కేంద్రంతో పాటు చెన్నారం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో తక్షణమే మౌలిక వసతులు కల్పించాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం.డీ జబ్బార్ డిమాండ్ చేశారు. శనివారం ఆయా పాఠశాలలను సీపీఎం ప్రతినిధి బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏదుల హైస్కూల్‌లో శిథిలావస్థకు చేరిన వంటగదికి మరమ్మతులు చేపట్టాలన్నారు. విద్యార్థులకు నాసిరకం బియ్యంతో మధ్యాహ్న భోజనం...