పారిశుధ్య కార్మికులపై సానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ జులుం
కార్మికుల ఆందోళన అపురూప కాలనీలో నిలిచిన పారిశుధ్య సేవలు మన తొలివెలుగు, కుత్బుల్లాపూర్ ప్రతినిధి టీ. రమేష్ : డివిజన్ పరిధిలోని అపురూప కాలనీ, ఎస్ఆర్ నాయక్ నగర్ ప్రాంతాల్లో పారిశుధ్య సేవలు పూర్తిగా స్తంభించడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పారిశుద్ధ్య ఎస్ఎఫ్ఎ ( సానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్) మొగులయ్య వ్యవహార శైలికి నిరసనగా పారిశుధ్య కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఈ పరిస్థితి ఏర్పడినట్లు సమాచారం. స్థానికుల కథనం ప్రకారం.. ఎస్ఆర్ నాయక్ నగర్ కు చెందిన ఎస్ఎఫ్ఎ మొగులయ్య...