పాలమూరు-రంగారెడ్డి కెనాల్ భూముల ఆక్రమణ.. మాజీ సర్పంచ్ శివరాం రెడ్డి ఆరోపణ
మన తొలివెలుగు ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద నాగపూర్-రేవల్లి కెనాల్ పరిధిలోని ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురవుతున్నాయని రేవల్లి మాజీ సర్పంచ్ శివరాంరెడ్డి ఆరోపించారు. నాగపూర్‌కు చెందిన ఓ రైతు ప్రభుత్వం నుంచి పూర్తి నష్టపరిహారం పొందినప్పటికీ, కెనాల్‌ను ఆనుకుని ఉన్న భూమిని చదును చేసి అక్రమంగా సాగు చేస్తున్నారని మండిపడ్డారు. అధికారుల ఉదాసీనత వల్ల భవిష్యత్తులో ప్రజావసరాలకు భూమి లేకుండా పోయే ప్రమాదం ఉందన్నారు. అధికారులు స్పందించి ఆక్రమణలను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు.